తెలంగాణ పాలిసెట్ (POLYCET) రిజల్ట్స్ 2025 – విడుదల Check your Result
తెలంగాణ పాలిసెట్ (TS POLYCET) 2025 ఫలితాలు మే 24, 2025 ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి.
👉 మొత్తం దరఖాస్తుదారులు: 1,06,716
👉 పరీక్ష రాసినవారు: 98,858
👉 హాజరు శాతం: బాలురు – 92.84%, బాలికలు – 92.4%
👉 పరీక్ష తేదీ: మే 13, 2025
👉 పరీక్ష కేంద్రాలు: 276.
ఫలితాలు ఎలా చూసుకోవాలి:
Check your Result 👉 DOWNLOAD RANK CARD
👉 లేదా అధికారిక వెబ్‌సైట్ (polycet.sbtet.telangana.gov.in)లో హాల్ టికెట్ నంబర్ ద్వారా ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిషన్ & కౌన్సెలింగ్:
👉 ఫలితాల తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తారు.
👉 మొత్తం సీట్లలో 85% స్థానికులకు, 15% స్థానికేతరులకు కేటాయింపు ఉంటుంది.
👉 అడ్మిషన్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, సీట్ అలాట్‌మెంట్ వంటి దశలు ఉంటాయి.
ముఖ్యమైన విషయాలు:
పాలిసెట్ ర్యాంక్ కార్డు అడ్మిషన్ ప్రక్రియకు తప్పనిసరిగా అవసరం. ఫలితాల తర్వాత అధికారిక నోటిఫికేషన్, కౌన్సెలింగ్ తేదీల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేయాలి.
మీరు సాధించిన ర్యాంక్ ఆధారంగా ఉత్తమ పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.